Mar 05,2023 22:38

ప్రజాశక్తి-గంపలగూడెం 

కొలిచేవారికి కొంగుబంగారం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి వారి బ్రహ్మౌత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఆలయ పురోహితులు తిరునగరి గోపాలచార్యులు పర్యవేక్షణలో నిత్య పూజలు, అలంకరణలు జరిగాయి.. శ్రీమాన్‌ పరేసరం రంగనాథ చార్యులు పర్యవేక్షణలో సకల జన నైనానందకరముగా జరిగాయి. ఆదివారం అంకురార్పణతో మొదలైన ఈ కార్యక్రమాల్లో ముఖ్య ఘట్టంగా వేణుగోపాలుని పెండ్లి కుమారుగా అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కావూరి శశిరేఖ , సహాయ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాద్‌, ఉత్సవ కమిటీ పెద్దలు భక్తులు పాల్గొన్నారు