Oct 30,2022 22:27

ప్రజాశక్తి - గంపలగూడెం 

జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారిని మైలవరం ఎమ్మెల్యే వసంత కష్ణ ప్రసాద్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు .ఆలయ చైర్మన్‌ కావూరి శశిరేఖ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు, సత్కారం, అనంతరం స్వామివారి చిత్రపటాన్ని వసంత కుటుంబానికి బహుకరించారు. కార్యక్రమంలో పురోహిత బందం, కొందరు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.