ప్రజాశక్తి - గంపల గూడెం : శ్రీ వేణుగోపాల స్వామి వారికి శుక్రవారం వెండి గిన్నె బహుకరణగా అందజేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ముద్దు నూరుకు చెందిన పసుమర్తి రాంబాబు - నాగమణి దంపతులు బహుకరించగా 575 గ్రాములు తోకంగాల ఈ గిన్నెను ఆలయ పురోహితులకు అప్పగించినట్లు ప్రసాద్ వివరించారు.










