Sep 11,2023 00:08

ప్రజాశక్తి - భట్టిప్రోలు ( వేమూరు)
నియోజకవర్గ కేంద్రమైన వేమూరు పుర వేదిక వద్ద చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు సామూహిక నిరాహార దీక్ష చేశారు. ముఖ్యమైన టిడిపి నాయకులను గృహ నిర్బంధం చేపట్టినప్పటికీ తప్పించుకుని దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో టిడిపి నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, వాకా శేషుబాబు, కనగాల మధుసూదన్ ప్రసాద్, ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు, బట్టు మల్లికార్జునరావు, సిరాజుద్దీన్, వేములపల్లి జగన్నాధరావు పాల్గొన్నారు.