Apr 29,2023 00:53
ప్రచారయాత్రలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి-వేమూరు: మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారభేరి శుక్రవారం మండల కేంద్రం వేమూరులో జరిగింది. బిజెపి పాలనలో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజానీకం వివిధ సమస్యలతో అల్లాడుతున్నారని, మోడీని, బిజెపిని ఇంటికి సాగనంపితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్‌ పిలుపునిచ్చారు. పార్లమెంటు సాక్షిగా ఏపి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి అగస్టీన్‌, జి సుధాకర్‌, నాగరాజు, ఎం సత్యనారాయణ, మస్తాన్‌రావు, దాసు తదితరులు పాల్గొన్నారు.