Sep 30,2023 21:59

సీఎంకు పుష్పగుచ్చం అందిస్తున్న సంపత్‌

వేలూరులో అస్సాం రోగులకు వసతులు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
అస్సాం రాష్ట్రం నుంచి వచ్చే రోగులకు వేలూరులో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆ రాష్ట్ర సీఎం డాక్టర్‌ హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వేలూరు సత్వాచ్చారిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయనకు వీఐటీ ఛాన్స్‌లర్‌ విశ్వనాథన్‌, నరువి ఆసుపత్రి ఛైర్మెన్‌ జీవీ సంపత్‌ పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం మాట్లాడుతూ వీఐటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు వేలూరుకు వచ్చి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంకా ఆసుపత్రులకు వచ్చే రోగులకు సౌకర్యవంతంగా భవనం నిర్మించినట్లు తెలిపారు. అందరికీ అనుకూలంగా భవనం ఉపయోగపడుతుందన్నారు.
సీఎంకు పుష్పగుచ్చం అందిస్తున్న సంపత్‌