Sep 14,2022 22:31

టెండర్లను తెరుస్తున్న దేవస్థానం అధికారులు

ప్రజాశక్తి-సింహాచలం: వివిధ రకాల వేలం పాటల ద్వారా సింహాద్రి అప్పన్న ఖజానాకు బుధవారం నిర్వహించిన వేలం పాటల ద్వారా రూ.5,25,42,797 ఆదాయం లభించింది. తలనీలాల ద్వారా రూ.1,64,00,000, టోల్‌గేటు ద్వారా రూ1,67,00,000, సన్నిధి ఫలాల ద్వారా రూ.42,09,999, కొండ దిగువ సన్నిధి ఫలాల ద్వారా రూ.18,21,000, భైరవ స్వామి పూజా సామాగ్రి విక్రయాల ద్వారా రూ.26,10,999, కొండపై కల్యాణ మండపాల ద్వారా రూ.48,10,000, కొండపైన క్యాంటీన్‌ ద్వారా రూ.15,10,000, క్లాక్‌ రూమ్‌ ద్వారా రూ.38,09,999, పుష్కరిణి చెరువు వద్ద ఫల సాయం ద్వారా రూ.1,03,500, ఇత్తడి, ఇనుము, అల్యూమినియం, స్టీలు వంటి సామగ్రి అమ్మకం ద్వారా కొంత ఆదాయం లభించింది. ఈ వేలం పాటల్లో దేవస్థానం ఎఇఒ ఆనంద్‌కుమార్‌, ప్రసాద్‌, వై.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు నిర్ధంనాయుడు, గోపీనాథ్‌, దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు, వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పాటదారులు పాల్గొన్నారు.