Oct 25,2023 20:43

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయ్ రామరాజు

కడప : పాడా పరిధిలోని పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన అభివద్ధి పనులను డిసెంబర్‌ నాటికి సంపూర్తి చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పులివెందుల నియోజకవర్గ అభివద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌తోపాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య, పాడా ఒఎస్‌డి అనిల్‌ కుమార్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ విజరు రామరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్వంత నియోజకవర్గం పులివెందులలో చేపట్టిన అభివద్ధి పనులన్నింటినీ వేగవంతం చేసి నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పులివెందులలో పురోగతిలో ఉన్న వివిధ అభివద్ధి పనులలో భాగంగా ప్రధానంగా సిటీ సెంట్రమ్‌, ఉలిమెల్ల లేక్‌ వ్యూ, జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో మౌలిక వసతులతో పాటు.. మోడల్‌ టౌన్‌లో భాగంగా చేపట్టే వివిధ అభివ ద్ధి పనుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి సమస్య, పెండింగ్‌ లేకుండా క్లియర్‌ చేయాలని సబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పులివెందుల ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, ఆర్‌అండ్‌బి, పిఆర్‌, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌, హౌసింగ్‌, మోడల్‌ టౌన్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు, ఎపిఎంఎస్‌ఐడిసి ఎస్‌ఇ, ఇఇలు, పాడా అధికారులు, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.