రాయచోటి : జిల్లాలో చేపట్టిన ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సంబం ధించి డికెటి భూముల అవార్డ్స్ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష ఆర్‌డిఒలు, తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూసేకరణ, పరి హారం చెల్లింపు ఆర్‌అండ్‌ఆర్ కార్యక్రమాలు, గాలివీడు మండలంలోని సోలార్ పార్క్ భూసేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముదివేడు బ్యాలె న్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తంగా 1074.63 ఎకరాలు అవసరం కాగా వందశాతం భూసేకరణ చేశారన్నారు. ప్రభుత్వ భూమి 177.66 ఎకరాలు, 446.50 ఎకరాల పట్టా భూములు, 451.65 డికెటి భూములు ఉన్నాయన్నారు. వీటిలో మొత్తం పట్టా భూములకు అలాగే డీకేటి భూములకు సంబంధించి 274.74 ఎకరాలకు అవార్డ్స్ ప్రక్రియ పూర్తి చేశార న్నారు. ఇంకను డికెటిలో మిగిలిన 176.91 ఎకరాలకు అవార్డ్స్ జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కురబలకోట, బి.కొత్తకోట తహశీల్దార్లకు సూచిం చారు. పాజెక్టులోని స్ట్రక్చర్లకు సంబంధించి సప్లిమెంట్ అవార్డులను కూడా పాస్ చేయాలని ఎస్‌సి డిసిలను ఆదేశించారు. గాలివీడు మండలం తూముకుంట, వెలిగల్లులలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్కుకు సంబంధించి కూడా ఇప్పటికే 1115 ఎకరాలు భూ సేకరణ చేశారని మిగిలినవి త్వరగా పూర్తి చేయాలన్నారు. సేకరిం చాల్సిన భూమిలో డికెటి, పట్టా, అసైన్మెంట్, ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి పరిహారం ఇచ్చారు, ఇంకా ఎంతమందికి చెల్లింపు చేయాలన్న విషయంలో సర్వేనెంబర్ వారీగా నివేదిక సమర్పించాలన్నారు. అవసరమైన భూసేకరణలో చుక్కల భూములు ఉంటే వెంటనే సర్వే నెంబర్ వారీగా వాటిపై నివేదిక సమర్పించి తగిన అనుమతులు పొందాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సహాయ పునరావాస కార్యక్రమాలను, ఇండ్ల పట్టాల ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ రెవెన్యూ, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి ఆర్డీవోలు రంగస్వామి, మురళి, హెచ్‌ఎంఎస్‌ఎస్ యూనిట్-2 ఎస్‌డిసి గోపాలకష్ణ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు భూములు గుర్తించాలి
జిల్లాలో వివిధ అభివద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ భూములు గుర్తించాలని కలెక్టర్ గిరిష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ విసి హాల్ నుంచి భూ సేకరణపై ఆర్‌డిఒలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ అభివద్ధి కార్యక్రమాలకు సంబంధించి అసైన్మెంట్ భూములు, ఇనామ్ భూములను గుర్తించి వెంటనే తమకు రిపోర్టు పంపాల న్నారు. జిల్లాలోని సంబంధిత తహశీల్దార్లు సర్వే నెంబర్ల వారీగా భూములు గుర్తించాలని ఈ కార్యక్రమాన్ని తహశీల్దార్లు, సీరియస్‌గా తీసుకొని త్వరితగతినహొ పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని సంబంధిత ఆర్‌డిఒలు అసైన్మెంట్, ఇనాం భూముల సేకరణపై తగు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గిరీష










