Mar 04,2023 23:39

వేగవంతంగా గృహ నిర్మాణాలు


ప్రజాశక్తి-యస్‌.రాయవరం:మండలంలోని తిమ్మాపురం, కోనవానిపాలెం గ్రామాల్లో జగనన్న లే అవుట్లను జిల్లా హౌసింగ్‌ స్పెషల్‌ అధికారి లక్ష్మిపతి తనిఖీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న గృహ యజమానులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులు ఉగాది లోపు పనులు మొదలు పెట్టాలని, లేని పక్షంలో కేటాయించిన స్థలాలను అర్హులకు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టని వారికి నోటీసులు జారీ చేయాలని హౌసింగ్‌ ఇంజనీర్లకు తెలిపారు. ఆయన వెంట ఎంపిడివో రామచంద్ర మూర్తి, తహశీల్దార్‌ శ్యామ్‌ కుమార్‌, యుఆర్‌డి సత్యనారాయణ, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
నక్కపల్లి:వేగవంతంగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో సీతారామరాజు సూచించారు. మండలంలోని ఉపమాక గ్రామంలో జగనన్న లే అవుట్‌ను శనివారం ఆయన సందర్శిం చారు. ఇంటి నిర్మాణం పనులను పరిశీలిం చారు. లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పటికే ఇంటి నిర్మాణాలు చాలా ఆలస్యం అయ్యాయని, త్వరతగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ రాజు తదితరులు పాల్గొన్నారు.