Jul 14,2023 21:13

వేగవంతంగా అంగన్వాడీ భవన నిర్మాణాలు : కలెక్టర్‌

రాయచోటి : నాడు-నేడులో మంజూరైన అంగన్వాడీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరిష ఐసిడిఎస్‌ సిడిపిఒ, సూపర్వైజర్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఐసిడిఎస్‌ సిడిపిఒ, సూపర్వైజర్‌లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూఫ్‌ లెవల్‌లో బిల్డింగ్‌ లన్ని ఈ నెల ఆఖరికి పూర్తి కావలన్నారు. నవజాతి శిశువు నుంచి ఆరు నెలలు, ఏడు నెలల నుంచి 36 నెలలు, 37 నెలల నుంచి 72 నెలల పిల్లల పెండింగ్‌ ఆధార్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ త్వరగా పూర్తి చేయాలన్నారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాలపై ప్రత్యేక దష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఉండాల్సిన బరువు కన్నా తక్కువ, ఉండాల్సిన ఎత్తు కన్నా తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. అంగ న్వాడీ కేంద్రాలపై సిడిపిఒలు, సూపర్వైజర్లు తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్స్‌ బాలాం మతం, గుడ్లు, పాలు, బియ్యం, కందిపప్పు, నూనె క్వాలిటీని పరిశీలించాలన్నారు. అవన్నీ పిల్లలకు గర్బిని మహిళలకు, బాలింతలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వారం అంగన్వాడీ కేంద్రాలను మహిళా పోలీసులు తనిఖీ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్‌ పీడీ ధనలక్ష్మి, సిడిపిఒలు, సూపర్వైజర్లు, సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష