Sep 05,2023 20:58

వేగవంతంగా అభివృద్ధి పనులు : గిరీష

రాయచోటి : జిల్లాలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలు వేగ వంతం చేయాలని కలెక్టర్‌ గిరీష అన్ని శాఖల హెచ్‌ఒడిలకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ వివిధ అభివద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల హెచ్‌ఒడిలు, ఎంపిడిఒలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరు గుతున్న అభివద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు. ఈ మధ్య జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిర్వహించిన రివ్యూ కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై ఆక్షన్‌ టేకెన్‌ రిపోర్టు మూడు రోజులలో తమకు పంపాలన్నారు. ఎపిఎస్‌పిడిసిఎల్‌కు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కరెంట్‌ లైన్‌ షిఫ్టింగ్‌ తదితర సమస్యలు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. డ్వామా, హౌసింగ్‌, పనులకు సంబంధించిన రిపోర్టు వెంటనే పంపాలన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సంబంధించిన పనులు ఒక్కటి కూడా పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఇకనుంచి రెండు రెండు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అభివద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖల అధికారులు రాబోయే మూడు రోజుల లోపల సిపిఒ కార్యాలయానికి తమ పరిధిలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాల నోట్స్‌ తయారు చేసి వెంటనే పంపాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సమావేశంలో ఎమ్మెల్యేలు అడిగిన పనులు ఏవి పెండింగ్‌ లేకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అన్ని అంశాలలో ముందుండే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురా వాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, హౌసింగ్‌ పీడీ శివయ్య, ద్వామా పీడీ మద్దిలేటి, పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్‌ పెళ్లై, వివిధ శాఖల హెచ్వోడీలు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష