Aug 19,2023 18:24

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : మండలంలో అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లె మండల పరిషత్‌ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపిడిఒ భాను ప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా మండలం పరిధిలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు సమగ్రంగా వివరించారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు, జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని ఎంఇఒ-2 రాజగోపాల్‌ తెలిపారు. విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు నిర్మాణం స్మార్ట్‌ టివి, లైట్లు ఫ్యాన్లు అందుబాటులోకి తీసుకు రావడంతోపాటు 89 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. మదనపల్లె మండలంలో పేదలందరికీ జగనన్న ఇండ్లు కార్యక్రమంలో 4852 ఇండ్లు మంజూరు కాగా, అందులో ఇంకా 500 ఇండ్లు ప్రారంభం కావాల్సి ఉందని, పునాదుల్లో 1744 ఇండ్లు, 550 ఇండ్లు గోడలు,1744 ఇండ్లు పూర్తి కావడం జరిగిందని వివరించారు.అలాగే టాయిలెట్స్‌ నిర్మాణానికి 12 వేల రూపాయలు,మురుగు నీరు వాటర్‌ రోడ్లుపైకి రాకుండ ఉండటానికి సోప్‌ పిట్‌ నిర్మాణానికిగాను రూ.6 వేలు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. 29 లేఅవుట్లలో ఇండ్లు నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ లబ్ధిదారులు అందరూ నవంబర్‌ నెలాఖరుకు ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోనేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారి నాగప్రసాద్‌ మాట్లాడుతూ ప్రస్తుత వర్షభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో సాగు 20 శాతం మాత్రమే జరిగిందని, ప్రత్యామ్నాయంగా 80 శాతం రాయితీతో ఉలవలు రైతులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు .జగనన్న శాశ్వత గహ హక్కు పథకం కింద 1436 మందికి డాక్యుమెంట్స్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తహసిల్దార్‌ మహబూబ్‌ చాంద్‌ తెలిపారు. మదనపల్లె మండలంలో నవరత్నాలు సంక్షేమ పథకాలలో భాగంగా 7330 మందికి పెన్షన్లు పంపిణి చేయడం జరుగుతోందని ఎంపిడిఒ భాను ప్రసాద్‌ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నవాజ్‌ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 98 శాతం అమలు చేసిందన్నారు. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని పథకాలపైన ప్రజలకు సంపూర్ణ అవగహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపిపి ఎర్రబల్లి రెడ్డెమ్మ, వైస్‌ ఎంపిపిలు రమణ, నందిని, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ తట్టి శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, సింగిల్‌ విండో చైర్మన్‌ దండు కృష్ణారెడ్డి, ఆర్‌బికె చైర్మన్‌ కత్తి రాజు మండల తహశీల్దార్‌ మహబుబ్‌ చాంద్‌ ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, కో-ఆప్షన్‌ సభ్యులు, అధికారులు, మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.