నేషనల్ హైవే పై నియంత్రణ లైన్లు ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐ రఘురాం
ప్రజాశక్తి అనందపురం : వాహనాల వేగ నియంత్రణ ద్వారా ప్రమాదాలను అరికట్టేందుకు అనందపురం పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆనందపురం కూడలి సమీపంలో పెందుర్తి నుండి తగరపువలస, మార్కెట్ నుండి తగరపువలస వెళ్లే జాతీయరహదారిలో ట్రాఫిక్ ఎస్‌ఐ రఘురాం ఆధ్వర్యంలో హైవే సిబ్బంది సహకారంతో వేగనియంత్రణకు రంబుల్ స్ట్రిప్స్, తెలుపు లైన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నేషనల్ హైవే ఇంజనీర్ పోలి నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.










