Dec 25,2022 00:00

పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని పెదదొడ్డిగల్లు, గుల్లిపాడు గ్రామాల్లో శనివారం జగనన్న లేఅవుట్‌ లను ఎంపీడీవో సీతారామరాజు, హౌసింగ్‌ అధికారులు సందర్శించారు. గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. వేగవంతం గా గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా గృహ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి అవగాహన కల్పించారు. త్వరగతిన నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇకపై అలా జరగడానికి వీలులేదన్నారు. లేఅవుట్‌ లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని లబ్ధిదారులు గృహ నిర్మాణాలు నిర్మించుకోవడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ లు తదితరులు పాల్గొన్నారు .