Mar 06,2023 23:06

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌
వేగా జ్యుయలర్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా బెంజిసర్కిల్‌ వద్ద గల ట్రెండ్‌ సెట్‌ మాల్‌లో టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్లు వనమా నవీన్‌, సుధాకర్‌ మాట్లాడుతూ వేగా జ్యూయలర్స్‌ ప్రచారకర్తగా హీరో బాలకృష్ణ వ్యవహరిస్తున్నారని ఆయనతో ప్రత్యేకంగా షూట్‌ చేసిన టీజర్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీన లబ్బీపేటలోని నందమూరి రోడ్డులో షోరూమ్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత రెండు దశాబ్ధాలుగా వేగా జ్యూయలర్స్‌ వివిధ ఆభరణాలను అందిస్తూ ఎంతో మంది ఖాతాదారుల అభిమానం పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం నగరంలో విస్తృతస్థాయిలో అతి పెద్ద షోరూమ్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని వర్గాల వారికి ఆభరణాలను అందిస్తున్నామని తెలిపారు. షోరూమ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పలు రాయితీలను ఖాతాదారులకు అందిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.