Aug 05,2023 07:47

అసుపత్రి సుపరిటెండెంట్‌ రోహిల్‌కు వినతిని ఇస్తున్న ఆశా కార్యకర్తలు

           హిందూపురం : హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో గైనకాలిస్టులు రెఫర్‌ల పేరుతో ఆశ వర్కర్ల పేరుతో వేధిస్తున్నారని, ఈ వేధింపులు ఆపాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప తెలిపారు. శుక్రవారం అసుపత్రి సుపరింటెండెంట్‌ రోహిల్‌కు ఈ విషయంపై ఆశ వర్కర్లు సిఐటియు నాయకులతో కలిసి వినతిని ఇచ్చారు. ఈ సందర్భంగా నరసింహప్ప మాట్లాడుతూ ఆశ వర్కర్లు కాన్పు కోసం తీసుకొచ్చిన గర్భిణులను స్థానిక వైద్యులు అనంతపురం రెఫర్‌ చేస్తున్నారన్నారు. వీరిని అనంతపురం తీసుకెళ్తే సాధరణ కాన్పులు అవుతున్నాయన్నారు. అక్కడి వైద్యులు హిందూపురం అసుపత్రిలో సాధరణ కాన్పులు సైతం చేయడం లేదా అంటు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇది చాలదన్నట్లు రెఫర్‌ చేసిన వారిని అనంతపురం తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యలోనే కాన్పులు అవుతున్నాయన్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నారని చెప్పారు. వీటిపై సమగ్ర ధర్యాప్తు జరిపి, రెఫర్‌లు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామకృష్ణ, ఆశ వర్కర్లు మమతమ్మ, జానక,ి జ్యోతి, లక్ష్మి, ప్రశాంతమ్మ, బీబిజాన్‌, నసిమా, అయిషా, జబీనా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.