ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర ఫ్యాఫ్టో పిలుపు మేరకు పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై వేధింపులు, అక్రమ సస్పెన్షన్‌లు రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో జిల్లా చైర్మన్ తోటకూర రవిచక్రవర్తి ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. చక్రవర్తి మాట్లాడుతూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి తీరు ప్రభుత్వ విద్యా రంగంపై నమ్మకాన్ని తగ్గించే విధంగా ఉందని తద్వారా ప్రయివేట్ విద్యా రంగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు ఉన్నాయన్నారు. వ్యవస్థాగతంగా ఉన్న టువంటి లోపాలను సరిదిద్దాల్సినటువంటి అధికారులు ఉపాధ్యాయులపై రుద్ది అక్రమ సస్పెన్షన్ చేయడం సహించమని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు నగేష్ తెలియ జేశారు. ఫ్యాఫ్టో కన్వీనర్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికా రులను సైతం బహిరంగంగా దుర్భాషలు ఆడటం ఆయన అధికార దర్పానికి నిదర్శనమన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాము మాట్లా డుతూ అధికారులు వైఖరి మార్చుకోకపోతే ఉద్య మాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం డిఇఒ అన్నపూర్ణకి వినతిపత్రం ఇచ్చార్ణు. ఎపిటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు టి.వెంకటరావు, వెంకట్రాజు, బిటిఎ అధ్యక్షుడు బి.శరత్, ఫ్యాఫ్టో కార్యదర్శి ఫిలిప్ రాజు, యుటిఎఫ్ అసోసియేట్ అధ్యక్షుడు ఐ.ప్రసా దరావు, బి.నాగ మణి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి దేవి పెద్దిరాజు, గిరిధర్ గోపాలరావు శ్రీరాములు డిఆర్ క వర్మ సిహెచ్ వేణు, యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకర్ వర్మ పాల్గొన్నారు.
ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు










