Jun 15,2023 20:31

నిలిచిన పైపులైన్‌ పనులను పరిశీలిస్తున్న సిపిఐ నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
నిలిచిన వేదవతి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపట్టి త్వరగా సాగు, తాగునీరందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కోరారు. గురువారం బిలెహాల్‌, నెట్రవట్టి గ్రామాల మధ్య నిలిచిపోయిన ప్రాజెక్టు పైపులైన్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేదవతి ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని, వేదవతి ప్రాజెక్టును 8 టిఎంసిలతోనే నిర్మించి ఆస్పరి మండలానికి కూడా సాగు, తాగునీరు వర్తింపజేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి, విరుపాక్షి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూపేష్‌, దేవనకొండ మండల కార్యదర్శి నరసరావు, హోళగుంద మండల సహాయ కార్యదర్శి మారెప్ప, ఎస్‌ఎంసి కమిటీ ఛైర్మన్‌ ఎస్‌ఎస్‌.బాష, ఎఐటియుసి అధ్యక్షులు శివ, రైతు సంఘం నాయకులు చంద్రకాంత్‌ రెడ్డి, వ్యకాస నాయకులు రాజశేఖర్‌ పాల్గొన్నారు.