డిఎఫ్‌ఒకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు సురేష్ తదితరులు
ప్రజాశక్తి చింతూరు
తులసి పాక కొండలపై గతేడాది వెదురు కర్రలు నరికి, డిపోలకు తరలించిన కార్మికులకు తక్షణమే వేతనాలను చెల్లించాలని సిపిఎం నాయకులు బుధవారం చింతూరు డిఎఫ్‌ఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.1.20 లక్షలు కార్మికులకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారులు, ఎఫ్‌ఆర్‌ఓ రాజుపై చర్య తీసుకొని కార్మికులకు వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో బ్యాంబో కార్మికులతో పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాదుల స్వామి రెడ్డి, మడకం లక్ష్మణ్, ఎరకం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.










