Jun 06,2023 23:44

వెబ్‌ ఆప్షన్‌ నమోదు సహాయ కేంద్రం ప్రారంభంలో యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ఉపాధ్యాయుల బదిలీలు సందర్భంగా వెబ్‌ కౌన్సిలింగ్‌లో ఉపాధ్యాయుల సౌకర్యార్ధం యుటిఎఫ్‌ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన వెబ్‌ అప్షన్‌ నమోదు సహాయ కేంద్రాన్ని మంగళవారం ఎన్‌ఎడి సమీపంలోని యుటిఎఫ్‌ విశాఖ జిల్లా కార్యాలయం (హష్మీ భవన్‌)లో యుటిఎఫ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఎస్‌ఎస్‌.నాగమణి, అనకాపల్లి జిల్లా గౌరవాధ్యక్షులు నెల్లి సుబ్బారావు, విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, టిఆర్‌ అంబేద్కర్‌ ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని కేడర్ల ఉపాధ్యాయులు తమ వెబ్‌ అప్షన్‌ నమోదుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. భీమిలి డివిజన్‌లో తగరపువలస కేంద్రంగా కూడా సహాయ కేంద్రం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా అధ్యక్షులు రొంగలి ఉమాదేవి, ఎం.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి చుక్క సత్యం, రియాజ్‌ అహ్మద్‌, రిజ్వాన్‌, అనకాపల్లి జిల్లా నాయకులు పి.శ్రీకాంత్‌, కుమారి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.