Feb 22,2023 23:56

వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే గొట్టిపాటి

ప్రజాశక్తి- పంగులూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పాల్గొన్నారు. తొలుత చినమల్లవరం గ్రామంలోని తొండెపు రామాంజనేయులు, పద్మావతి దంపతుల కుమారుడి వివాహం రెండు రోజుల క్రితం జరగగా నూతన వధూవరులను ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చినమల్లవరం మాజీ సర్పంచి గోవిందమ్మ భర్త టిడిపి నాయకుడు వెంకటేశ్వరరావు (కె.వి.ఆర్‌) రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉప్పలమర్తి రామారావు కొన్ని రోజుల క్రితం గుండె శాస్త్ర చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన పరామర్శించి ఆరోగ్య విషయం వాకబు చేశారు. అనంతరం నార్నేవారి పాలెంలో రావిపాటి చిన వెంకయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా ఆయన పరామర్శించారు. అదే గ్రామానికి గుంటుపల్లి సుబ్బాయమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌, నాయకులు ఉక్కపల్లి ఏడుకొండలు, మాజీ జడ్‌పిటిసి కరీ వెంకట సుబ్బారావు, సుబ్బారావు ,అధ్యక్షుడు చింతల సహదేవుడు, డెయిరీ మాజీ చైర్మన్‌ బాలిన రామ సుబ్బారావు పాల్గొన్నారు.