Apr 04,2021 10:28

కావాల్సిన పదార్థాలు : మామిడి ముక్కలు - 2 కప్పులు, శనగపప్పు - కప్పు, బొబ్బర పప్పు - కప్పు, ఎండుమిర్చి - 2 చెంచాలు, రస్కుల పొడి - కప్పు, పచ్చిమిర్చి - 6, జీలకర్ర - టీ స్పూను, ఉప్పు - 2 టీ స్పూన్లు, నూనె - 250 గ్రాములు.
తయారుచేసే విధానం : పప్పులు నానబెట్టి నీరు వడకట్టి మిక్సీ పట్టాలి. దీనిలో ఉప్పు, జీలకర్ర, ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, మామిడి ముక్కలు చేర్చి మిక్సీ పట్టాలి. పాన్‌లో నూనె మరగించి, పై మిశ్రమం ఉండలుగా చేసి, రస్కుల పొడిలో ముంచి ప్లాస్టిక్‌ పేపర్‌పై వత్తి నూనెలో వదలాలి. ఇలా మొత్తం వడలన్నీ వేయించి పెట్టాలి. కరకరలాడే మామిడి వడలు రెడీ..