Mar 20,2023 22:42

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
               జీలుగుమిల్లిలో సోమ వారం సాయంత్రం ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. అకాల వర్షానికి రహదారులన్నీ జలమ యమయ్యాయి. అకాల వర్షానికి పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, మొక్కజొన్న, పొగాకు, జీడిమామిడి, మామిడి, పుచ్చపంటలు దెబ్బతిన్నాయి. గాలులకు పలుచోట్ల జాతీయ రహదార్లపై భారీ వృక్షాల కొమ్మలు పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై చెట్ల కొమ్మలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. జీలుగుమిల్లి గ్రామంలో రాజు అనే వ్యక్తి షెడ్డుపై రేకులు లేచిపోవడంతో ఇంట్లోని సామానం తడిచిముద్దయ్యింది. సిటిఆర్‌ఐ సమీపంలో ఆగి ఉన్న ఆటోపై చెట్ల కొమ్మలు పడటంతో ఆటో ధ్వంసమైంది.
పంటలను పరిశీలించిన ఉద్యాన శాఖాధికారి
మండలంలోని వంకవారిగూడెం, జీలుగుమిల్లిల్లో అకాల వర్షాలకు నేలమట్టమైన దొండ తోటలను కొయ్యలగూడెం ఉద్యాన శాఖాధికారి ప్రసన్నలక్ష్మి పరిశీలించారు.