Oct 20,2023 20:50

'బాబుతో నేను' నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - కోసిగి
వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటమి తప్పదని టిడిపి నాయకులు తెలిపారు. టిడిపి మంత్రాలయం ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కోసిగిలోని 9వ వార్డు దుర్గా నగర్‌ వడ్డే గేరి వీధుల్లో 'బాబుతో నేను' నిర్వహించారు. మండల అధ్యక్షులు జ్ఞానేష్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి వైసిపి వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో టిడిపి అధినేత చంద్రబాబు జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని తెలిపారు. ప్రజలంతా చంద్రబాబుకు మద్దతు పలకడాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్‌ జీర్ణించుకోలేక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చి అబద్దాల ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వైసిపి ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో కక్ష పూరితంగా చంద్రబాబును అరెస్టు చేయించిందని విమర్శించారు. లేని స్కామ్‌ను సృష్టించి చంద్రబాబును ఇరికించారని తెలిపారు. జగన్‌ పాలనలో కక్ష సాధింపులే తప్ప అభివృద్ధి లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని ఓడించి ఇంటికి సాగనంపాలని కోరారు. టిడిపి మండల నాయకులు ఎస్సీ సెల్‌ నాయకులు ఎస్‌.మర్రెప్ప, పంపాపతి, కొండగేని వీరారెడ్డి, నాడిగేని వీరారెడ్డి, వడ్డే రామయ్య, ఉమర్‌ సాబ్‌, గాంధీనగర్‌ శీను, కోడి పెద్దఈరన్న, మునెయ్య పాల్గొన్నారు.