
ప్రజాశక్తి నర్సీపట్నం టౌన్:వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. తన స్వగృహంలో సోమవారం నియోజవర్గ క్లస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, నర్సీపట్నం నియోజక వర్గంలో నాతవరం మండలం మన్యపుఉరట్ల, మాకవరపాలెం మండలం కోడూరు, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామం నుండి వైసీపీ పార్టీ నుండి తెలుగదేశం పార్టీ లో చేరిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో రూ.300 కోట్ల స్థలం విజయసాయిరెడ్డికి అప్పజెప్పడానికి ఒప్పందం కుదిరిందని విమర్శించారు. విశాఖ పట్నానికి రక్షణ కవచం వంటి కొండని కొల్ల గొట్టడం దౌర్భాగ్యమన్నారు. ఓటర్ వెరిఫికేషన్‌ను పార్టీ ఇన్చార్జులు పరిశీలించాలన్నారు. క్లస్టర్ ఇంచార్జీలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాయల రాజేష్, నియోజకవర్గంలో నాలుగు మండలాల కు చెందిన పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు పాల్గొన్నారు.