పల్నాడు జిల్లా: రానున్న ఎన్నికల్లో మతతత్వ పార్టీలను ఓడించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి పిలుపు నిచ్చారు. నరసరావుపేటలోని కృష్ణవేణి మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం భారత్ బచావో మొదటి జిల్లా మహాసభ జరిగింది. సమావేశానికి భారత బచావో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.నవజ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో నేడు మతోన్మాద ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం కొద్ది మంది కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరుస్తూ దేశంలో 80 శాతం మంది ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టి వేస్తోందని విమర్శించారు. బిజెపిని ప్రశ్నిస్తున్న మేధా వులు, హక్కుల , ప్రజాసంఘాల నాయకులపై నిర్బంధ ఉపా చట్టం మోపి జైలు పాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ నిర్బంధాలకు, దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజ లను యువతను ఐక్యం చేసి చైతన్యం నింపి ఉద్యమించా లని పిలుపు నిచ్చారు. పాలస్తీనా పై ఇజ్రా యిల్ దాడులను వెంటనే నిలిపివేయాలని తీర్మానం చేశారు. అనంతరం భారత్ బచావో పల్నాడు జిల్లా నూతన కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భారత బచావో స్టేట్ కౌన్సిల్ సభ్యులు బి. కోటేశ్వరరావు, జి.రత్నం, సీతా మహాలక్ష్మి, అందెశ్రీ, పిడిఎఫ్ రాష్ట్ర నాయ కులు వై.వెంక టేశ్వరరావు,ఎన్.రామారావు తదితరులు పాల్గొన్నారు.










