ప్రజాశక్తి- అరకులోయరూరల్:వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు. సమన్వయంతో పని చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అక్షరు ఇన్‌లాడ్జిలో టీడీపీ అరకు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అవంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని కార్యకర్తలను సూచించారు. భాధుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలన పై ప్రజల వద్దకు వెళ్ళి వివరించాలని చెప్పారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు నిచ్చినా అందరూ కలిసి కట్టుగా సమన్యయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్టి సెల్ అధ్యక్షుడు సివేరి దొన్ను దొర, మాజీ మంత్రి అరకు నియోజకవర్గ ఇన్చార్జి కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ అరకులోయ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, పెదలబుడు సర్పంచ్ పెట్టేలి దాసుబాబు, టీడీపీ మాజీ ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యుడు సివెరి అబ్రహం, మహిళా నాయకురాలు బుర్జ బారికి లక్ష్మీ పాల్గొన్నారు.










