ప్రజాశక్తి- రాంబిల్లి
నేవీ నిర్వాసితుల సమస్యలను టిటిడి చైర్మన్, వైసిపి ఆరు జిల్లాల ఇన్‌ఛార్జి వైవి.సుబ్బారెడ్డికి 9 నిర్వాసిత గ్రామాల పెద్దలు విన్నవించారు. మంగళవారం అనకాపల్లిలోని వైసిపి కార్యాలయానికి వెళ్లి వైవి.సుబ్బారెడ్డికి ఎలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు ఆధ్వర్యాన 9 గ్రామాల పెద్దలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసిత నాయకులు మాట్టాడుతూ 44 రోజులుగా నేవీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్నా తమ సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. దీనికి స్పందించిన ఆయన నిర్వాసితుల సమస్యలపై ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్‌తో తమ పార్టీ ఎంపీల ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు.
44వ రోజుకు నిర్వాసితుల ఆందోళన
నేవీ మెయిన్ గేట్ ముందు ఎనిమిది గ్రామాల నేవీ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 44వ రోజుకు చేరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










