Aug 08,2023 20:46

మాట్లాడుతున్న విసి చింతా సుధాకర్‌

 కడప అర్బన్‌ : యోగివేమన విశ్వవిద్యాలయ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా దూరవిద్యా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం వి సి ప్రొఫెనర్‌ చింతా సుధాకర్‌ వెల్లడించారు. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. సి.పి బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగి వేమన విశ్వవి ద్యాలయం సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ (సిడిఒఇ) విద్యా సేవలు ప్రారంభ మయ్యాయన్నారు. ఈ విద్య సంవత్సరం నుంచి ఎంఎ ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, చరిత్ర, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, ఎంఎ స్పెషల్‌ తెలుగు, ఎం కామ్‌ జనరల్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు వివరి ంచారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఉన్నత విద్యను విస్తత పరిచేందుకు డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తే ఆయన ఆకాంక్షల మేరకు ఏర్పాటైన వైవీయూ అనతికాలం న్యాక్‌ ఎ గ్రేడ్‌ పొంది అత్యున్నత విద్యాసంస్థగా నిలిచిందన్నారు. ఇంతటి అభివద్ధికి కారణం ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు, అధ్యా పకుల సిబ్బంది సమిష్టి కషి అన్నారు. రాష్ట్రంలో విశిష్టమైన ఖ్యాతిని మొదటిసారిగా దూరవిద్య, ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభిస్తున్నామన్నారు. పేదరికం, ఆర్థిక పరిస్థితుల దష్ట్యా, కుటుంబ బాధ్యతలు మోయల్సిన పరిస్థితులు రావడం, రెగ్యులర్‌గా చదువులు కొనసాగించలేని వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి దూరవిద్య కోర్సులు అద్భుత అవకాశం అన్నారు. విశ్వవిద్యాలయ పరిధిలో దూరవిద్య కోర్సుల కోసం లెర్నర్‌ సపోర్ట్‌ సెంటర్లను, ప్రత్యేక కేంద్రాలను ప్రారం భించనున్నామని తెలిపారు. దూరవిద్య కోర్సులకు ప్రత్యేక పోర్టల్‌ అందుబాటులో ఉంటుందన్నారు. దూర విద్యను అందుబాటులోకి తేవడానికి కషి చేసిన సి డి ఓ ఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కష్ణారెడ్డి, అందులోని సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్‌ ఎస్‌ రఘునాథరెడ్డి, దూర విద్యా కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్‌ కె. కష్ణారెడ్డి, ఉపసం చాలకులు డాక్టర్‌ శ్రీధర్‌ బాబు, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫె సర్‌ ఎస్‌. రఘునాథరెడ్డి, దూర విద్యా కేంద్రం ఉపసం చాలకులు డాక్టర్‌ శ్రీధర్‌ బాబు, బ్రౌన్‌ గ్రంథాలయ సంచాల కులు ఆచార్య రామ ప్రసాద్‌ రెడ్డి, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు డాక్టర్‌ ఎస్‌. వి. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.