ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీషం రామకృష్ణ, వైసీపీ నేతలు కోరారు. కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న టిటిడి పాలక మండలి చైర్మన్ వై వి.సుబ్బారెడ్డిని ఆదివారం నక్కపల్లి జంక్షన్ వద్ద కలిశారు. వీసం రామకష్ణ ఆయనకు వెంకన్న జ్ఞాపికను అందజేశారు.2018 లో వెంకన్న ఆలయాన్ని టీటీడీ లోకి విలీనం చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయ రత్న కుమారి, వైసిపి నాయకులు వీసం రాజు, అల్లాడ కొండ, కొల్లాటి బుజ్జి, ఎల్లెటి సత్యనారాయణ, బంగార్రాజు,తాతారావు తదితరులు పాల్గొన్నారు .
జర్నలిస్టులకు ఇళ స్థలాలు కేటాయించాలి
నక్కపల్లి:జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్, టిటిడి బోర్డు చైర్మన్ వై.వి సుబ్బారెడ్డిని జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కోరాడ చందర్రావు కోరారు. కాకినాడ నుంచి వై.వి సుబ్బారెడ్డి విశాఖపట్నం వెళ్తుండగా మార్గ మధ్యలో నక్కపల్లి జంక్షన్ వద్ద ఆదివారం చందర్రావు కలిసి మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.










