Jun 17,2023 20:48

విద్యార్థులకు నగదును అందజేస్తున్న ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు వైసిపితోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని శ్రీనీలకంఠేశ్వర స్వామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని తెలిపారు. పిల్లలు బాగా చదవాలంటే వారికి పౌష్టికాహారం కూడా అవసరమని మధ్యాహ్న భోజనం మెనూ కూడా మార్చారని చెప్పారు. ప్రతి పేద విద్యార్థికీ అండగా ఉంటూ బూట్లు, పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ఎంఇఒ ఆంజనేయులు పాల్గొన్నారు.