ప్రజాశక్తి - దేవనకొండ
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తోందని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ సోదరుడు, దేవరగట్టు ఆలయ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు తెలిపారు. గురువారం గ్రామ సచివాలయ ఆవరణలో వైసిపి మండల కన్వీనర్ మల్లికార్జున, వైసిపి నాయకులు దివాకర్ నాయుడు ఆధ్వర్యంలో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. ముందుగా వైసిపి జెండాను ఆవిష్కరించి, సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడారు. సచివాలయ, వాలంటీరు వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కప్పట్రాళ్ల సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాల ద్వారా రూ.29.69 కోట్ల ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అందరిపైనా ఉందన్నారు. అనంతరం ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎంపిడిఒ గౌరీదేవి, ఇఒఆర్‌డి సూర్యనారాయణ, జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి భర్త లుముంబా, జెసిఎస్ మండల కోఆర్డినేటర్ రాజారెడ్డి, తెర్నేకల్ సర్పంచి అరుణ్ కుమార్, వైసిపి నాయకులు నారాయణరెడ్డి, పల్లెదొడ్డి చంద్రన్న, చాప వీరన్న, రాఘవేంద్ర, పెద్ద లింగన్న, కృష్ణ, వడ్డే ఉరుకుందు, రామాంజనేయులు పాల్గొన్నారు.