Nov 06,2023 18:10

మంత్రి కాకాణి సమక్షంలో చేరుతున్న దృశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని చింతోపు పంచాయతీలో టిడిపికి తెలుగు తమ్ముళ్లు షాక్‌ ఇచ్చారు. ఆంజనేయపురం గ్రామానికి చెందిన వందమందికి పైగా టిడిపి కుటుంబాలు వైసిపిలో చరాయి. వైసిపి మం డల కన్వీనర్‌ ఉప్పల శంకర య్య గౌడ్‌, సర్పంచ్‌ లేబూరు మల్లిఖార్జున, యువజ న నాయకులు లేబూరు బాలా ర్జున్‌ ఆధ్వర్యంలో వారంతా వైసిపిలో చేరారు. సోమవా రం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి టిడిపి శ్రేణులకు వైసీపీ కండువా వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వా నించారు. మంత్రి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం లో దాదాపుగా టిడిపి ఖాళీ అయిందన్నారు. వైసిపి నాయ కులు జగన్నాటి వీర రాఘవయ్య, వి. సుధాకర్‌, వై. కొండయ్య, మల్లి, లేబూరు మ హేష్‌ పాల్గొన్నారు.