Nov 22,2023 00:05

ప్రజాశక్తి - చీరాల
వైసిపిలో విభేదాలు బయట పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి పట్టణంలోని కొందరు కౌన్సిలర్లు ముఖం చాటేస్తున్నారు. జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం వైసిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించి మరోసారి జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించే కార్యక్రమంలో స్థానిక నాయకులదే అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు పట్టణంలో జరుగుతున్న ప్రభుత్వ ప్రచార కార్యక్రమం మంగళవారం పట్టణంలోని పేరాల, గొల్లపాలెం  సచివాలయంలో 5, 10, 11వార్డుల పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5, 11వార్డుల కౌన్సిలర్లు సూరగాని లక్ష్మి, తోకల అనీల్ ముఖం చాటేశారు. వైసిపి కౌన్సిలర్లు హాజరు కాకపోవడం విమర్శలకు కారణమైంది. ఎంఎల్‌ఎ తమకు ప్రాధాన్యత తగ్గించారనే కారణంతోనే ముఖం చాటేసినట్లు వైసిపి కార్యకర్తలే చర్చిస్తున్నారు. అదే క్లస్టర్ 2లోని 10వ వార్డ్ కౌన్సిలర్ గోలి స్వాతి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. వైసిపి జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెసిఎస్ పట్టణ ఇంచార్జీలు దాసరి రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు షేక్ కబీర్, కౌన్సిలర్ బత్తుల అనిల్, కంపా అరుణ్, గోలి జగదీష్, వైసిపి నాయకులు షేక్ సుభాని, గోలి రవి, వాసిమల్ల వాసు, మామిడాల సుబ్బారావు, చిలుకోటి శ్రీను, మున్సిపల్‌ డిఇ ఐసయ్య పాల్గొన్నారు.