ప్రజాశక్తి - రేపల్లె
వైసిపి మండల నూతన కన్వీనర్లు నియమించినట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వహిస్తున్న గాదే వెంకయ్య బాబును రెండవసారి పార్టీ రూరల్ కన్వీనర్‌గా నియమించారు. ఈ సందర్భంగా వెంకయ్య బాబు కేక్ కట్ చేసి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ప్రతీ గ్రామంలోనూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు వెంకయ్య బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.










