Oct 07,2023 23:51

ప్రజశక్తి - చీరాల
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తలను అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్ అన్నారు. పట్టణంలోని కారంచేడు గేటు సెంటర్‌లో వైసీపీ పట్టణ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కొండ్రు బాబ్జిని శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్కు బాణా సంచాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు అందరి సంక్షేమం కోసం సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సేవలును ప్రజల ఇంటి వద్దకు తీసుకువచ్చిన ఘనత సిఎం జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమైందని అన్నారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి వైసిపి జెండా ఎగురవేయాలని అన్నారు. అధ్యక్షులు కొండ్రు బాబ్జి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చీరాల అభ్యర్థిగా వెంకటేష్ బాబును గెలిపించుకోవటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. తొలుత అంబేద్కర్, పూలే, బుద్దుడు, వైఎస్ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసిమళ్ల సల్మాన్ అధ్యక్షుతన జరిగిన సభలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు గొట్టిపాటి ఎబినేజర్, గుంటూరు ప్రభాకరరావు, బాలకృష్ణ, మించాల సాంబశివరావు, పొత్తూరి సుబ్బయ్య, ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణరెడ్డి, తలకాయల సుదీర్, యాతం మేరిబాబు, శిఖా సురేష్ పాల్గొన్నారు.