ప్రజశక్తి - చీరాల
వైసిపి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన కోండ్రు బాబ్జిని పట్టణంలోని 33వ వార్డు వైసిపి నాయకులు తలకాయల సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైసిపి ఏర్పడినప్పటి నుంచి పార్టీకి సేవలందించిన కోండ్రు బాబ్జికి అధ్యక్షుడిగా పదవి అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మరింత ఉత్సాహంగా పనిచేసి సిఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పదకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పూలమాలతో సత్కరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు బడుగు భూషణం, గర్నెపూడి చంద్ర, బల్లికురవ సొలోమోను, గుజ్జర్లపూడి రూబేను, దావులూరి సురేష్, కొప్పుల చిన్న, ఏలియా, సురేంద్ర, భరత్, బింటు, డక్కుమల్ల బాబు, ఆనంద్, లాజర్, వంశీ, గిద్దోను పాల్గొన్నారు.










