Sep 10,2023 21:54

ఫొటో : సామూహిక నిరసన దీక్షలో పాల్గొన్న మాలేపాటి, తదితర టిడిపి నాయకులు

వైసిపి పతనం ప్రారంభం : మాలేపాటి
ప్రజాశక్తి-కావలి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఆదివారం కావలి టిడిపి కార్యాలయం వద్ద నాయకులు సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. రెండోరోజు కూడా కావలి నియోజకవర్గంలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కావలి కార్యాలయం వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. మాలేపాటిని బయటకు రావద్దంటూ గృహ నిర్బంధం చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలోని టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి కార్యాలయం వద్ద బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చేరుకున్న పత్రిక విలేకరులతో మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ తమ అధినేత, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న మహోన్నతమైన వ్యక్తిని నిన్నటి రోజున అరెస్టు చేయడం బాధాకరమైన విషయంగా పరిగణించామన్నారు. చి
న్న మచ్చ కూడా లేని చంద్రబాబుపై ఇటువంటి నేరారోపణలు చేయడం వైసిపి దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరే లేకుండా అరెస్టు ఎలా చేశారని ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డి దొంగ కాబట్టి అందరిని దొంగలుగా చేయాలని ఇటువంటి చర్యలు చేపడుతు న్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఒకవైపు, మరోవైపు లోకేష్‌ ప్రజాదరణ పొందుతున్న విషయాన్ని జీర్ణించుకోలేక కుట్ర పన్ని ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. నిన్నటి రోజున అరెస్టు చేసి 72 సంవత్సరాల వయసున్న చంద్రబాబుని 24 గంటలసేపు వాహనాలలో తిప్పడం దారుణమన్నారు. ఈరోజు మనం చట్టాలు, రాజ్యాంగాలతో సంబంధం లేని ప్రభుత్వ పాలనను చూస్తున్నామన్నారు. తమ అరెస్టులకు బెదిరింపులకు టిడిపి నాయకులు, కార్యకర్తలు భయపడే రోజులు పోయాయని, రాబోయే రోజుల్లో ఒక్కొక్కరికి పూర్తి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. పోలీసులను గుమస్తాలుగా ఉపయోగించుకోవడం మానుకోవాలని జగన్మోహన్‌ రెడ్డికి హితువు పలికారు. సైకో మైండ్‌సెట్‌తో రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేసిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికేదక్కిందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంది చాలక, క్రమశిక్షణ కలిగిన టిడిపి అధినేతనే అరెస్టు చేయించడంతో వైసిపి ప్రభుత్వానికి బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయిందని, సైకో పాలనకి సెండ్‌ ఆఫ్‌ చెప్పే రోజులు దగ్గర కువచ్చాయని హెచ్చరించారు. ఈ దీక్షలలో టిడిపి నాయకులు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్‌ బాబు, పోతుగంటి అలేఖ్య, గుండ్లపల్లి శివాజీ, ఏగూరి చంద్రశేఖర్‌, మంచాల ప్రసాద్‌, బూచి రవి యాదవ్‌, ప్రళయకావేరి మల్లికార్జున (చేపల మల్లి), చిట్టబత్తిన మాల్యాద్రి, కోసూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.