ప్రజాశక్తి - టి.నరసాపురం
వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని టిడిపి మండల అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్ విమర్శించారు. తెడ్లెం గ్రామంలో ఆదివారం టిడిపి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం జగన్ పాలనలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయన్నారు. టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, ఆయిల్‌పామ్ మొక్కలు సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో యువతకు భవిష్యత్ లేదని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సిఎం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామ్మూర్తి, సొసైటీ మాజీ అధ్యక్షులు బొంతు సత్యనారాయణ, ఆచంట సూర్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, నాయకులు బండి శ్రీనివాసరావు, శౌరి పాల్గొన్నారు.










