ప్రజాశక్తి - పెద్దకడబూరు
వైసిపి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎఒ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎపి మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రవి చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని పంటను అమ్ముకోవడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారని చెప్పారు. ప్రభుత్వం నుంచి రైతులకు అన్ని విధాలుగా సహాయం, సహకారాలు అందిస్తామని తెలిపారు. విపత్తుల్లో రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకుంటున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల దగ్గర నుంచి ఎపి మార్క్‌ఫెడ్ సంస్థ వారు ఇంటర్న్‌కు రూ.1962 మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు.
మాట్లాడుతున్న పురుషోత్తం రెడ్డి










