
వైసిపి ప్రభుత్వం పేదల ప్రభుత్వం
- మున్సిపల్ వైస్ ఛైర్మన్
ప్రజాశక్తి-వెంకటగిరి: వైసిపి పేదల ప్రభుత్వ మని మున్సిప ల్ వైస్ ఛైర్మన్ శాతరాసి బాలయ్య పేర్కొన్నారు. స్థానిక 4వ సచివా లయంలో 'జగన్ననే సిఎం ఎందుకు కావాలి?' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామిలను అన్నీ నెరవేర్చి ఆధారాలతో సహా సచివా లయంలో బోర్డు పెట్టిన ఎన్నికల్లో పోయే ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. పేదలకు పథకాలు ఇవ్వడంతో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పిన టిడిపి నాయకులు వచ్చే ఎన్నికల్లో పేదలకు ఏమీ చేయరన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయి నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ పట్టణ కన్వీనర్ గుమ్మళ్లపు ఢల్లిీబాబు, గ్రంథాలయ ఛైర్‌పర్సన్ దొంతు శారద, 14వవార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.