అచ్చంపేట: సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వైసిపి ప్రభుత్వం ఇసుక దోపిడీ కొనసాగిస్తోందంటూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. మంగళవారం కోనూరు సమీపంలో ఇసుక అక్రమంగా నిలువ చేసిన డం పింగ్ యార్డ్‌ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , స్థానిక నాయకులు ఇసుక బకాసురుల్లా ఉన్నారని, ఎటు వంటి అనుమతులు లేకుండా ఇసుక డంపింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోనూరు నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించి బోట్ మెయిన్స్ సొసైటీలో ఉపాధి కోల్పోయారన్నారు. ఇష్టానుసారంగా నదిలో పొక్లెయిన్ల ద్వారా లోడింగ్ చేస్తూ కూలీల జీవనోపాధికి ఈ ప్రభుత్వం గండి కొడుతోందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా అధిక ారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎటువంటి తీసుకోకపో వడం లేదని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అను మతులు లేని డంపింగ్ యార్డ్ లను స్వాధీనం చేసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఆయన వెంట టిడిపి నాయకులు ఎన్.ఆశీర్వాదం, మాజీ జెడ్పిటిసి ఎన్.వెంకటేశ్వర్లు, చందు, టి.ఆంజనేయులు, కె.దెబ్బయ్య, ఆర్.తామస్, ఎస్.కిరణ్ ఉన్నారు.










