Oct 16,2023 20:09

'బాబుతో నేను' నిర్వహిస్తున్న తిక్కారెడ్డి

ప్రజాశక్తి - కోసిగి
వైసిపి ప్రభుత్వానికి ఓటమి పట్టుకుందని, ఆ భయంతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో కేసులో అక్రమంగా అరెస్టు చేయించిందని టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, టిడిపి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌ అధ్యక్షతన, క్లస్టర్‌ ఇన్‌ఛార్జీ భరద్వాజ శెట్టి ఆధ్వర్యంలో 'బాబుతో నేను' చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోనే అవినీతి, ఆరోపణలు లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. వైసిపి ప్రభుత్వం కుట్రపూరిత చర్యలతో అవినీతి, అసత్య ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయించిందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉందని గ్రహించి, బాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారన్నారు. ఇంటింటికీ తిరుగుతూ అక్రమ కేసుపై ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు అయ్యన్న, వక్రాని వెంకటేశ్వర్లు, ఉమర్‌ సాబ్‌, రవితేజ శెట్టి, సల్మాన్‌ రాజు, నాడిగేని రంగడు, మహాదేవ, కొండగేని వీరారెడ్డి, మారెప్ప, రాజు, సరోజ పాల్గొన్నారు.