Mar 06,2023 00:49
ఎంఎం కొండయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న కార్యకర్తలు

ప్రజాశక్తి-చీరాల: వైసిపి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారని రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చీరాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని రెండు మూడు నాలుగు వార్డులలో సుమారు 20 కుటుంబాల ముస్లింలు, టిడిపి రాష్ట్ర నాయకురాలు పంచుమర్తి అనురాధ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సజ్జా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ యువనేత లోకేష్‌ చేపట్టిన పాదయాత్రను వైసిపి అడుగున అడ్డుకుంటూ ఆటంకాలను సృష్టిస్తుందని అన్నారు. వైసిపి ప్రభుత్వం నియంతపాలన కొనసాగిస్తోందని, ప్రజలు అందరూ గమనిస్తున్నారని, ప్రశ్నించే టిడిపి నేతలను అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆయన వెంట టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కూరపాటి పూర్ణచంద్రరావు, కొమ్మనబోయిన రజిని, కౌతవరపు జనార్దన్‌, బుద్ధి శివయ్య కరిముల్లా, మంగపతి పలువురు టిడిపి నాయకులు ఉన్నారు.