
రాయచోటి : వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందా, లేక వైసిపి నాయకుల కోసం పనిచేస్తుందా అని సందేహం వ్యక్తం అవుతుంది అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఎక్కడ చూసినా గహనిర్బంధాలు వాహనాలు రోడ్డుమీదికి రాకుండా బారికేట్లు ఏర్పాటుచేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తండ్రి కోసం ఢిల్లీ నుంచి బయ లుదేరిన లోకేష్ పర్యటనలో అడుగడుగునా అడ్డంకులు సష్టిస్తూ ఆయన్ను ప్రజలు ఎక్కడా కలవకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు పోలీసు వ్యవస్థ చేస్తుండడం చాలా దారుణంగా కనిపిస్తువన్నారు. అధికారమనేది శాశ్వతం కాదని వ్యవస్థలేనని పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థలు ఇప్పుడు వైసిపి పాలనలో పూర్తిస్థాయిలో నిర్వీర్యమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు బోన మల ఖాదర్‌వలీ, సహదేవరెడ్డి, రమేష్‌బాబు, శ్రీనివాసులు, రాజు, సుబ్బరా యుడు, రామకష్ణగౌడ్, అమావాస్య రెడ్డయ్య, భాస్కర్‌రాజు, నాగేంద్రారెడ్డి, సయ్యద్‌పీర్, రియాజ్, చిన్న వెంకటయ్య, వెంకటేష్, వాసుదేవ రెడ్డి, భాస్కర్, నీలకంఠారెడ్డి, అన్నయ్య, ప్రసాద్, నరహరి, ప్రభాకర్, వీర నాగిరెడ్డి, చంద్రమౌళి, రమణయ్య, సత్యనారాయణ, సుధాకర్, రెడ్డయ్య పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్ : ఎపిని అభివద్ధి పథంలో నడిపించి, నిరంతరం రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం తపనపడే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. శనివారం బాబుకి తోడుగా నియంతపై పోరాటానికి మేము సైతం రిలే నిరాహారదీక్ష 24వ రోజు కొనసాగింది. కార్యక్రమంలో యువ నాయకులు దొమ్మలపాటి యశశ్వి రాజ్, నియోజకవర్గ పరిశీలకులు చలపతి నాయుడు, నాయకులు ముసలికుంట నాగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. పుల్లంపేట :మండల పరిధిలోని రెడ్డిపల్లిపేటలో చంద్రబాబుకు మద్దతుగా గ్రామస్తుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.