Oct 29,2023 21:42

కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

         ప్రజాశక్తి-కళ్యాణదుర్గం    వైసిపి పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని వాల్మీకులకు పెద్దపీట వేశారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. పట్టణంలో ఆదివారం ఆమె ఎమ్మెల్సీ మంగమ్మ, వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, వాల్మీకి ఫెడరేషన్‌ ఛైర్మన్‌ పొగాకు రామచంద్రతో కలిసి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పూర్ణకుంభాలతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాముడు లాంటి మహనీయుడి చరిత్రను మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి, మన భారతదేశ చరిత్రను ప్రపంచానికి చాటిన మహామూర్తి వాల్మీకి అన్నారు. సిఎ జగన్‌ ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వాల్మీకులను గుర్తించి పార్టీలో పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన వాల్మీకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.