Jul 27,2023 20:46

మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి

పొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : వైసిపి ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని టిడిపి జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి విమర్శించారు. స్థానిక తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 93.2 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారన్నారు. సగటున రూ.2.54 లక్షలు ఒక్కొ రైతుపై అప్పు ఉందన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉందన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఎపి రెండో స్థానం లో ఉందన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఆ ఊసే లేదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులపై దృష్టి ఉంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ సిద్దయ్య, టప్పబాషా పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
జమ్మలమడుగు రూరల్‌ : ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాని టిడిపి ఇన్‌ ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి పిలుపు నిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురు వారం జమ్మల మడుగు పట్టణ, మం డలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్లు, యూనిట్‌, బూత్‌ ఇం చార్జ్‌లతో ఇంటిగ్రేట్‌డ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ సమిష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కాటిరెడ్డి, మండల అధ్యక్షుడు దేవగుడి యూత్‌ నాగేశ్వరరెడ్డి, నవనీశ్వర్‌రెడ్డి, కిరణ్‌ రాయల్‌, హనుమంతు నాయక్‌ పాల్గొన్నారు.