
వైసిపి పాలనలో రాష్ట్రప్రజలు సుభిక్షం
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : వైసిపి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఇందుకూరుపేట మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఇందుకూరుపేట 2/1 సచివాలయ పరిధిలో వైసిపినేత భీమవరపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోపరేట్ బ్యాంక్ చైర్మన్, వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులరెడ్డి విచ్చేశారు. అనంతరం సచివాలయం ద్వారా ఇప్పటివరకు అందించిన జాబితా లిస్ట్ ప్రారంభించారు. 33 పథకాలు అమలు ఇప్పటివరకు సచివాలయం పరిధి ద్వారా వివిధ పథకాల ద్వారా మొత్తం ఖర్చుపెట్టిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వలంటీర్లకు మెటీరియల్ సంచులను టోపీలను అందజేశారు. కార్యక్రమంలో ఎపిఎల్‌డిఎ చైర్మన్ గొల్లపల్లి విజరు కుమార్, కైలాసం శ్రీనివాసులు రెడ్డి, బివి రమణయ్య, లేబూరు వెంకురెడ్డి, ఇఒపిఆర్‌డి వసుంధర, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.