Jul 12,2023 21:03

వైసిపి పాలనలో రాష్ట్రం వెనుకబాటు : టిడిపి

రాజంపేట అర్బన్‌ : వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడిపోయిందని టిడిపి నాయకులు అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్తుకు బ్రహ్మరథం బస్సుయాత్ర పీలేరు నుంచి బుధవారం రాజంపేటకు చేరుకుంది. రాజంపేట పురవీధులలో పసుపుదళం పోటెత్తింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రైల్వేకోడూరు, వీరబల్లి, రాజంపేట, నందలూరుకు చెందిన పార్టీ ఇన్చార్జులు, క్లస్టర్‌ ఇన్‌ఛా ర్జులతో ఎస్సార్‌పాలెం వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో టిడిపి అభిమా నులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని 2024లో అధికారం తమదేనన్న ధీమాను వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌ పాలెం నుంచి యాత్ర కూచివారిపల్లిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి భోజనానంతరం తిరిగి యాత్రను ప్రారంభించి పాత బస్టాండ్‌ కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలతో నివాళులర్పించారు. అక్కడి నుంచి యాత్రను తిరిగి ప్రారంభించి బోయిన పల్లిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ యాత్రతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం పుంజుకుంది. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టుకోవడంలో ఈ యాత్ర విజయ వంతమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్‌ సిఐ పుల్లయ్య, పట్టణ ఎస్‌ఐలు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు అడుగడుగునా నిఘా ఉంచుతూ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బత్యాల మాట్లాడుతూ రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. ఇందుకు నిదర్శనం ఈ జన సందోహమేనన్నారు. జగన్‌మోహన్‌రాజు మాట్లాడుతూ టిడిపి ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజలు యాత్రకు నీరాజనం పలుకుతున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని., ప్రజలు టిడిపికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జోన్‌-4 పరిధిలోని చిత్తూరు, రాజంపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటులోని అసెంబ్లీ నియోజకవర్గాలఇన్‌ఛార్జులు, పార్లమెంటు అధ్యక్షులు పాల్గొన్నారు.బస్సు యాత్రలో పాల్గొన్న టిడిపి శ్రేణులు